
చందుర్తి, వెలుగు: మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు కొనుగోలు కేంద్రాలను అప్పగించామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి, కిష్టంపేట గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి కింద ఐకేపీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి కొనుగోలు కేంద్రాలను శనివారం ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను కోటీశ్వరులు చేయాలని సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా 50% కొనుగోలు కేంద్రాలను వారికి కేటాయించారన్నారు.
చందుర్తి మండల మహిళా సమైక్యకు రూ. 30 లక్షలతో బస్సు మంజూరు చేశామని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం శ్రీనివాస్, ఏపీఎం రజిత, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి, పార్టీ మండల అధ్యక్షులు చింతపల్లి రామస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టే ప్రభాకర్, వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, మాజీ జడ్పీటీసీ నాగం కుమార్, మహిళ సమైఖ్య సభ్యులు నాయకులు పాల్గొన్నారు.